ఎవరు చూపించలేని Song Lyrics





 
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని
Yevaru choopinchaleni - Ilalo nanu veediponi

 ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువనూ యేసయ్య
Yenthati prema needi - Inthalaa korukundi 
(2x)

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
Nee kathe nanne thaakaga - Naa made ninne cheragaa

 నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరా
Naa gure neevai undaga - Nee dare ne cheraanuga

|| ఎవరు చూపించలేని|Yevaru Choopichaleni||


తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
Theerale dooramaaye - kaalaale maaripoye

ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
Yeduraina yendamaave - kanneeti kaanukaaye

నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
Naa gunde lothulona - Ne naligipothu unnaa

ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
Ye daari kaanaraaka - Nee koraku vechi unna

ఎడబాటులేని గమనాన  - నిను చేరుకున్న సమయాన
Yedabaatu leni gamanaana - Ninu cherukunna samayaana

నను ఆదరించే ఘన ప్రేమ -  అపురూపమైన తొలిప్రేమ
Nanu aadarinche ghana prema - Apuroopamaina tholi prema

ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా 
Yekamai thoduga - oopire neevuga

ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
Yevvaroo leruga - yesayya neevega

|| ఎవరు చూపించలేని|Yevaru Choopichaleni||
 

ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
Ee loka jeevithaana - Vesaripothu unna

విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
Viluvaina needu vaakyam - veliginche naa praanam

నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
Nee sannidhaanamandu - Seeyonu maargamandu

నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
Nee divya sevalone - Nadipinche naa prabhu

నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన
Nee thoti saagu payanaana - Nanu veedaledu kshanamaina

నీ స్వరము చాలు ఉదయాన -  నిను వెంబడించు తరుణాన
Nee swaramu chaalu udayaana  - Ninu vembadinchu tarunaana

శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో 
Sasvatha prematho - Sathya vaakyambutho 

నిత్యము తోడుగా -  నిలిచె నా యేసయ్య
Nithyamoo thoduga - Niliche naa yesayya

|| ఎవరు చూపించలేని|Yevaru Choopichaleni||

                                                     


Download Christian wallpapers @Jasphens

No comments:

Post a Comment

Praise the Lord

నీ స్వరమే విన్నా Lyrics

నీ స్వరమే విన్నా - నీ మమతే  కన్నా ప్రియమైన నా యేసయ్య Nee swarame vinna - nee mamathe kanna - priyamaina naa yesayya  నా చెలిమే నీవై - నీ ప్ర...